నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
మంగళవారం రోజున బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రైతుల అక్రమ అరెస్టులు అని వారిని విడుదల చేయాలని నిరసిస్తూ అంబేద్కర్ కి వినతి పత్రం ఇవ్వడం పట్ల పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భూషణవేణి సురేష్ గౌడ్, వారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు స్థానిక పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం అపవిత్రం అయినందున విగ్రహానికి పాలాభిషేకం తో శుద్ధిచేసి అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్, పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొంకూరి అవినాష్ మాట్లాడుతూ..గత బిఆర్ఎస్ పాలనలో ఖమ్మం జిల్లాలో పోడు భూమురైతులను పండించిన పంటను ధ్వంసం చేసి కూలి చేసుకునే ఆడవారు అని చూడకుండా వారిపై, రైతులపై దాడి చేసి వారిని జైలుకు పంపిన ఘనత మీకే దక్కింది అంతే కాకుండా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కి 10 సంవత్సరాలు అయినా కూడా రుణమాఫీ చేయకపోవడం ప్రజలు గమనించారు. మీరాక్షపాలనలో ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకనే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు గద్దె దింపారు అయినా కూడా మీకు ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నామని భ్రమలో ఉన్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఉంటే మీకు నిద్ర పట్టక అవాకులు చేవకులు పేలుచున్నారు మీరు 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారు.ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 500 కే గ్యాస్ మరియు నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా 200 యూనిట్లు వరకు కరెంటు ఫ్రీ అందివ్వడం జరుగుతా ఉంది ముఖ్యంగా రైతులకు పండించిన పంటకు 500 వందల బోనస్ తో రైతుల ఆనందం వెరిజల్లుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు.అలాగే పేద ప్రజలకు వైద్యానికిఆరోగ్యశ్రీ కింద పది లక్షలు అలాగే రాబోయే రోజుల్లో కౌలు రైతులకు 12, వేలఆర్థిక సాయం అందించనున్నారు. ఇలా అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తుంటే వీరికి నిద్ర పట్టడం లేదు అసెంబ్లీలో ప్రజల బాగోగుల కొరకై మంచి సలహాలు ఇవ్వాల్సిన ప్రతి పక్ష నాయకుడే కరువైన తెలంగాణ అసెంబ్లీ అని ప్రజలు ముక్కు మీద వేలువేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి కొరకై సలహాలు ఇవ్వా లి అలాగే పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో బిఆర్ఎస్ వారు 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఒక సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి నిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కొరకై పాటుపడుతున్న స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అబద్ధ మాటలను ప్రచారం చేస్తున్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పెద్దపల్లి నియోజకవర్గం లో ఎన్ని కోట్ల అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు బూతగడ్డ సంపత్ ,ఎరుకల కల్పన రమేష్ ,తాడూరి పుష్పకళ శ్రీమాన్ ,పైడా పద్మ రవి, మార్కెట్ డైరెక్టర్ మాడగోని శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి జగదీష్ ,ఉపాధ్యక్షులు నాంసాని శ్రీనివాస్ ,కాంగ్రెస్ నాయకులు తూముల మహేష్, సూత్రపు పరమేష్, బండ శ్రీనివాస్, పూదరి,మహేందర్, ఉనుకొండ,రాకేష్ పటేల్, కోదాడి,భాస్కర్, అడపా,సంతోష్ ,భాష, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

