**నేటి సాక్షి- మేడిపల్లి (దుమాల అనీల్ )* భీమారం మండల కేంద్రంలోని ఓ మహిళకు అత్యవసర సమయంలో రక్తం అవసరమని వైద్యులు సూచించగా, కుటుంబ సభ్యులు బక్కూరి ఫౌండేషన్ చైర్మన్ నరేష్ సంప్రదించారు. ఆయన సూచనల మేరకు భీమారం మండల కేంద్రానికి చెందిన యువ రైతు స్వామి రెడ్డి ముందుకొచ్చి రక్తదానం చేసి మానవతా సేవకు నిదర్శనంగా నిలిచాడు.సమయానికి రక్తం అందడంతో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సందర్భంగా రక్తదానం చేసిన స్వామి రెడ్డిని బక్కూరి ఫౌండేషన్ చైర్మన్ నరేష్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.

