Wednesday, July 23, 2025

బడి గంటలు..మోగే వేళ.!!——

నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం * ఇక ‘ఆటాపాట’లకు స్వస్తి..’పుస్తకాల’తో దోస్తీ.!——————————–*నేటి సాక్షి – కోరుట్ల**రాధారపు నర్సయ్య*——————————–దాదాపు రెండు నెలలుగా మూగబోయిన బడిగంటలు నేటి నుంచి మోగనున్నాయి. తెలంగాణాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు నిన్నటితో (జూన్ 11) తో వేసవి సెలవులు ముగిశాయి..నేటి నుంచి (జూన్ 12) స్కూళ్ళన్నీ తెరుచుకోనున్నాయి. ఇన్నిరోజులు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులను ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లమంటే బాధ కలుగుతుంది. కానీ వేసవితోనే సెలవులు ముగియలేదు… ఈ అకడమిక్ ఇయర్ లో ఇంకా చాలా హాలిడేస్ ఉన్నాయని విద్యార్థులు గుర్తించాలి. *ఇదీ 2025-26 అకాడమిక్ ఇయర్*తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ ఇదే.తెలంగాణలో జూన్ 12 నుండి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అకడమిక్ ఇయర్ (2025-26) కి సంబంధించిన ప్రణాళికలను విద్యాశాఖ రూపొందించింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుండి ముగింపు వరకు విద్యాబోధన, సిలబస్, పరీక్షలు, సెలవులు, ఇతర ముఖ్యమైన అంశాలతో కూడిన వివరాలతో అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది విద్యాశాఖ.ఈ విద్యా సంవత్సరం 2025, జూన్ 12 నుండి 2026, ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. అంటే ఏప్రిల్ 23, 2026 లాస్ట్ వర్కింగ్ డే.. ఆ తర్వాత దాదాపు రెండునెలలు వేసవి సెలవులుంటాయి. 2026 లో వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ అకడమిక్ ఇయర్ లో మొత్తం 230 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా అకడమిక్ క్యాలెండర్ 2025-26 కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసారు.*ఈ ఇయర్ లో సెలవులెన్నంటే..!*తెలంగాణలో ఈ విద్యాసంవత్సరంలో వచ్చే సెలవులెన్నో తెలుసా?వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయని విద్యార్థులకు బాధ వద్దు… ఎందుకంటే ఈ అకడమిక్ ఇయర్ భారీ సెలవులు వస్తున్నాయి. పండగలు, జాతీయ పర్వదినాలు, ఇతర వేడుకలతో పాటు వచ్చేఏడాది వేసవి సెలవులు కలుపుకుని మొత్తం విద్యాసంవత్సరంలో 135 రోజుల సెలవులు వస్తున్నాయి. సంవత్సరంలో 365 డేస్ అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూల్స్ నడిచేది కేవలం 230 రోజులు మాత్రమే.*పండగలే పండుగలు.!*తెలంగాణలో పెద్ద పండగ దసరా… బతుకమ్మ వేడుకలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ పండక్కి స్కూల్ విద్యార్థులకు భారీగా సెలవులు వస్తాయి. ఈ విద్యాసంవత్సరంలో కూడా సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు.ఇక క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ కు డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 27 వరకు సెలవులు ఇవ్వనున్నారు… కానీ ఈ సెలవులు మిషనరీ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించనున్నాయి… మిగతా విద్యార్థులకు రెండు రోజులే సెలవు.వచ్చేఏడాది ఆరంభంలో అంటే జనవరి 2026 లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఈ అకడమిక్ ఇయర్ లో జనవరి 11 నుండి జనవరి 15 వరకు అంటే ఐదురోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలా కీలకమైన పండగలకు భారీ సెలవులు రాగా మిగతా పండగలు, ప్రత్యేక రోజుల్లో సెలవులు రానున్నారు.*అన్నీ కలుపుకుని 135 రోజుల సెలవులు.!*అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొనకున్నా మరిన్ని సెలవులుతెలంగాణ అకడమిక్ క్యాలెండర్ పేర్కొన్నట్లు 230 రోజులు వర్కింగ్ డేస్ చాలా కష్టం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు, బంద్ లు వంటి వివిధ కారణాలతో స్కూళ్లు మూతపడవచ్చు. అంటే స్కూళ్ళకు 135 రోజులకంటే ఎక్కువగానే సెలవులు వచ్చే అవకాశం ఉంది.గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈసారి కూడా ఇలా వర్షాలు దంచికొడితే ముందుగా స్కూళ్లకు సెలవులు ఇస్తారు. ఇలా వాతావరణ పరిస్థితుల కారణంగా స్కూళ్లకు సెలవులు పెరిగే అవకాశాలుంటాయి.ఇక విద్యార్థి సంఘాలు, ఇతర యూనియన్స్, రాజకీయ పక్షాల బంద్ ల కారణంగా కూడా స్కూళ్లకు సెలవులు వస్తాయి. ఇక స్థానిక వేడుకలు, ఇతర పరిస్థితుల కారణంగా కొన్ని స్కూళ్ళకు ప్రత్యేక సెలవులు వస్తాయి. ఇలా మొత్తంగా అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నట్లు కేవలం 135 రోజులే కాదు… విద్యార్థులకు మరిన్ని సెలవులు వచ్చే అవకాశాలుంటాయి.*ఇక అసలు విషయానికొస్తే..*వేసవి మొత్తం..ఐస్ లా కరిగిపోయినా.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ‘ఖర్చులు’ తడిసిమోపెడవుతున్నాయని గుండెలుబాదుకుంటున్నారు.ప్రైవేటు పాఠశాలలలో అడ్మిషన్ ఫీజులు‌‌.. ట్యూషన్ ఫీజులు.. బుక్స్.. బ్యాగులు..టైలు..బెల్టులు..బూట్లు..యూనిఫాంలు..స్టేషనరీ..బస్సు..వ్యాన్..ఆటో ఫీజులు వెరసి మోయలేని బరువే అవుతోంది.!*సర్కారు వారి పాఠశాలలూ అంతే.!*ప్రైవేటే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒక్క ఫీజులు మినహా మొత్తం ‘సేమ్ టు సేమ్’.! ప్రభుత్వ ఉపాధ్యాయులు.. కొందరు ప్రధానోపాధ్యాయులు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నడిపేందుకు..తామూ ర్యాంకులు సాధించేందుకు ‘తగ్గేదేల్యా’..అంటూ ప్రణాళికలు రచించుకుంటుండడంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు ఖర్చులు తప్పేలా లేవు.*అడ్డగోలుగా దోపిడీలు*ఇదే అదనుగా ఆటోలు..వ్యానుల వాళ్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయని..మాకూ కుటుంబ ఖర్చులు పెరిగాయని .. ఫీజులు పెంచకతప్పట్లేదంటూ పేర్కొంటుండడం గమనార్హం.*దొరకని అప్పులు..తప్పని తిప్పలు*తమకు సరిగా చదువులు లేకపోయినా..తామ పిల్లలైనా బాగా చదువుకోవాలన్న ఆశతో తల్లిదండ్రులు ‘ఖరీదైన కార్పొరేట్ స్కూల్లో’ చేర్పిస్తూ ‘జేబులు ఖాళీ’ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటు స్కూల్ ఫీజులు యేడాదికి ఒక్కసారే కట్టేవాళ్లకు 5% డిస్కౌంట్ ఇస్తుంటే..6 నెలలకోసారి కడతామని కొందరు పేరెంట్స్ చెప్పుకుంటున్నారు.అటు పుస్తకాలు.. ఇతరత్రా స్టేషనరీ.. షాపింగ్ లకోసం నగదు రూపంలో నే చెల్లించాల్సి వస్తుంది.దీంతో తప్పనిసరిగా పేరెంట్స్ అప్పుల వేటలో పడ్డారు.కానీ..ఎక్కడా రూ.10.వేల అప్పు పుట్టట్లేదు.దీంతో గత్యంతరం లేక మెడలో చైన్ లు..చెవి కమ్మలను ‘గోల్డ్ లోన్’లు తీసుకుంటూ పిల్లలకు ‘బడికి అవసరమైన సామగ్రి’ కొనడంలో తలమునకలై ఉన్నారు.దీన్నే అంటారేమో..ఒకప్పుడు బడులకు పిల్లలు ‘చదువు’కునేందుకు వెళితే.. ఇప్పుడు చదువు-‘కొనుక్కు’నేందుకు వెళుతున్నారని నాటి పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు.!!___________________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News