నేటిసాక్షి,మిర్యాలగూడ : ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ప్రచురించిన బడిబాట కర పత్రాలను బుధవారం ట్రిపురారం మాజీ జడ్పీటిసి దనవత్ భారతీ భాస్కర్ నాయక్ ఆవిష్కరించారు. చెన్నాయిపాలెం ఉన్నత పాఠశాల ఆద్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని వస్రాం తండ, లక్పత్తి తండ, నడిమి తండ, చౌళ్ళ తండ, సత్యంపాడ్ లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని అర్హతలు కల ఉపాద్యాయులు ప్రభుత్వ బడుల్లో పని చేస్తున్నారని, మెరుగైన, నాణ్యమైన విద్య ప్రభుత్వ బడుల్లో అభిస్తుందని తెలిపారు. సన్న బియ్యంతో భోజనం లభించడంతో పాటు ఆట పాటల ద్వారా, డిజిటల్ భోధన కొనసాగుతుందని, అత్యున్న ఫలితాలు సాధించే సర్కారు బడులను ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దనవత్ భాస్కర్ నాయక్, ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి సైదిరెడ్డి, ఉపాద్యాయులు సత్యనారాయణ, సైదులు, స్వామి, లక్ష్మి, మాలోత్ దశరథ్ నాయక్, శ్రీనివాస్, విజయలక్ష్మి, నరేందర్, ఝాన్సి, లలిత విద్యార్దులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

