అధికారుల సేవలు మరువలేనివి
నేటి సాక్షి, జగదేవపూర్:
జగదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వర్తించి బదిలీ పై వెళ్తున్న అధికారులకు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జగదేవ పూర్ మండల పరిషత్ అభివృద్ది అధికారి బి. యాదగిరి ఆద్వర్యం లో ఆత్మీయ వీడ్కోలు సన్మానం కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు.
ముందుగా పంచాయతీ కార్యదర్శులు, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ మండలానికి ఎంపిడిఓ గా ఎంపీవో గా శ్రీనివాస్ వర్మ చేసిన సేవలు మరువలేనివి అని అదేవిదంగా ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివి అనికొనియాడారు. తదనంతరం వారికి శాలువాలతో ఘనంగా సన్మానించి మెమెంటో లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ యాదగిరి మాట్లాడుతూ ఉద్యోగ బదిలీ అనేది సహజం అని
ఉద్యోగం చేసిన చోట అందరి మన్ననలు కూడ గట్టుకోవడం గొప్ప అని అలాంటి పేరును బదిలీ పై వెళ్తున్న అధికారులు ఈ మండలములో తెచ్చుకోవడం గొప్ప విషయమని, మండల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ ఖాజా మొహినోద్ధిన్, సూపర్డెంట్ ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ యాదయ్య,పంచాయతీ కార్యదర్శులు, బదిలీ పై వెళ్తున్న అధికారులు సీనియర్ అసిస్టెంట్ మధార్, జూనియర్ అసిస్టెంట్ అనిత,పంచాయతీ కార్యదర్శులు హరీశ్, సత్యం, వేణు,కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది తది తరులు పాల్గోన్నారు