నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ వికలాంగుల పునరావాస, పరిశోధన కేంద్రం బర్డ్ ఆసుపత్రిలో1997వ సంవత్సరం నుంచి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2019 నుంచి 2024వ సంవత్సరం వరకు దీపావళి వేడుకలు జరపడం నిలిచిపోయింది. తిరిగి ఈ సంవత్సరం నుంచి వైద్యులు, సిబ్బంది కలసి రోగులతో తిరుపతి బర్డ్ హాస్పిటల్ లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారులతో మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషంట్లలో దీపావళి పండుగ జరుపుకోలేక పోయామన్న బాధను పోగొట్టడం ఈ వేడుక ముఖ్యోద్దేశ్యం. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులతో ఈ పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకం. పలు ప్రాంతాల నుంచి వివిధ రకాలైన అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు అక్కున చేర్చుకొని వారికి స్వాంతన చేకూర్చడం బర్డ్ హాస్పిటల్ ప్రధమ కర్తవ్యం. ఈరోజు బర్డ్ హాస్పిటల్ లో ఉన్న దివ్యాంగులకు వారి స్వస్థలంలో పండుగ చేసుకోలేదని వారి భావనను తొలగించి వారితో కలిసి ఈరోజు వేడుక చేసుకోవటం చాలా ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. బర్డ్ హాస్పిటల్ డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాటు దివ్యాంగులతో మమేకమై వారికి ధైర్యం కల్పిస్తూ మనం కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి పండుగ చేసుకునే వాతావరణాన్ని కల్పించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది బర్డ్ హాస్పిటల్ పేషెంట్స్ తో కలిసి ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా వారికి మానసిక స్వాంతన చేకూర్చటంతో పాటు మనోధైర్యాన్ని మరియు నమ్మకం కలిగించడం ప్రధాన లక్ష్యం. బర్డ్ హాస్పిటల్ ఎంతో దివ్యాంగులను సకలాంగులుగా చేసి సమాజంలో తిరిగి వారి పాదాల మీద వారి నడుస్తూ వారు స్వతంత్రంగా జీవించటానికి ఎంతో దోహద పడింది ఇప్పటివరకు ఒక లక్ష 90 వేల పైచిలుకు శస్త్ర చికిత్సలను నిర్వహించి మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోని అతిపెద్ద హాస్పిటల్ గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. బర్డ్ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంతో సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. మన దేశవ్యాప్తంగా అందరికీ బర్డ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను కూడా సమకూర్చుకోవడం జరుగుతోంది. మునుముందు అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ వెల్లడించారు





