Sunday, March 15, 2026

*బర్లీ పొగాకు కొనుగోలకు చర్యలు – రైతులకు అండగా ఉంటాం*•తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఏలూరి పర్యటన•తుపానుతో దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం•రోడ్ల మరమ్మత్తులకు ఆదేశించిన ఎమ్మెల్యే సాంబన్న •ప్రభుత్వం నుంచి తుపాను సహాయం అందిస్తాం •వరి,పత్తి,మినుము,పెసర, మొక్కజొన్నలకు నష్టం •పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం •తుపాను వల్ల పాడైన రోడ్లకు త్వరలోనే మరమ్మతులు చేస్తాం•వరద కాలువలను పూడిక తీసి ఆధునికరిస్తా •మార్టూరు,పర్చూరు మండలాల్లో పర్యటన ఎమ్మెల్యే ఏలూరి•మార్టూరులో పాఠశాల పరిశీలన వంటగదిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి •పొట్టి శ్రీరాములకు ఎమ్మెల్యే ఏలూరి నివాళి •పలువురికిఎల్ఓసిలు అందించిన ఎమ్మెల్యే ఏలూరి..

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో రైతులను పరామర్శిస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం మార్టూరు, పర్చూరు మండలాల్లో పర్యటించారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, రహదారులను పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పర్చూరు,నాగులపాలెం, ఉప్పుటూరు, వీరన్నపాలెం, పోతుకట్ల, కోమర్నేనేనివారిపాలెం గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు గల కారణాలు అడవి తెలుసుకున్నారు. వరద కాలువల పూడిక తీసి ఆదరణకరిస్తామని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.తుపాను ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.*తుపానుతో దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం*నియోజకవర్గంలో వరి, పత్తి, మినుము, పెసర, మొక్కజొన్న , జూట్ పంటలకు నష్టం జరిగిందని పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తుపానుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.*రోడ్ల మరమ్మత్తులకు వెంటనే ఆదేశాలు*తుపాను వల్ల పాడైన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే సాంబన్న మరమత్తులకు ఆదేశించారు. సంబంధిత అధికారులను వెంటనే పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లను త్వరలోనే పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేస్తామన్నారు. పంటలకు ఎలాంటి నష్టం లేకుండా వరద కాలువలను పూడిక తీసి ఆధునీకరిస్తాం” అని తెలిపారు.*బర్లీ పొగాకు కొనుగోళ్లపై దృష్టి – రైతులకు భరోసా*బర్లీ పొగాకు రైతుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి మిగిలి ఉన్న పొగాకును కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల చరిత్రలో పొగాకు కొనుగోలు చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వాని దేని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రైతుల వద్ద మిగిలి ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.*మార్టూరులో పాఠశాల పరిశీలన*మార్టూరులోని విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ఏలూరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో ముచ్చటించారు. పాఠశాలలో మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న నూతన తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఇదే అంశంపై సర్వ శిక్ష అభియాన్ పీఓ తో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల అవసరాలు, మౌలిక సదుపాయాలపై అధ్యాపకులతో చర్చించారు. అక్కడే కొత్తగా ఏర్పాటుచేసిన వంటగదిని ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు.*పొట్టి శ్రీరాములకు నివాళి*ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే ఏలూరి పూలమాలవేసి నివాళులు అర్పించారు.తెలుగువారి ఆత్మగౌరవం కోసం చేసిన త్యాగం స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. అనంతరం పర్చూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు మామిడిపకారి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.*ఎల్‌ఓసీలు అందజేత*ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి అత్యవసర వైద్యానికి పలువురు లబ్ధిదారులకు ఎల్‌ఓసీలను ఎమ్మెల్యే ఏలూరి అందజేశారు.బొల్లపల్లి గ్రామానికి చెందిన మొగిలిచర్ల హర్షవర్ధన్ కు అత్యంత అవసర చికిత్స కొరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా రూ: 1,00,000 చెక్కును,ఇంకొల్లు గ్రామానికి చెందిన లెక్కే శ్రీకాంత్ కు అత్యంత అవసర చికిత్స కొరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా రూ: 2,00,000 చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు ఉన్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News