నేటిసాక్షి కరీంనగర్: కరీంనగర్ టూటౌన్ పోలీస్స్టేషన్, కరీంనగర్ అర్బన్ రెవెన్యూ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లోనే అక్రమ రవాణాదారులు ఇసుకను డంప్ చేస్తున్నారు. రాంచంద్రాపూర్ కాలనీ, ఏవోస్ కాలనీ తదితర ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో సమీప గ్రామాల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి డంప్ చేస్తున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇండ్ల మధ్యనే ఇసుకను నిల్వ చేస్తుండడంతో సమీపంలోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

