నేటి సాక్షి , మహబూబాబాద్(భూక్యా రవి నాయక్) జనవరి 20 నరసింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామం మహారాజుల కాలనీకి చెందిన బహుజన బిడ్డ కొమ్ము ప్రగతి కరాటేలో ప్రతిభను చాటుతూ డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించడం గ్రామానికి అపారమైన గర్వకారణంగా మారింది. వరంగల్ టీఎస్ మహిళ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న ప్రగతి, చదువుతో పాటు క్రీడల్లోనూ తన సత్తాను నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచింది.సామాజిక వెనుకబాటును అధిగమించి పట్టుదల, క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని గ్రామ పెద్దలు కొనియాడారు. ప్రగతి సాధించిన ఈ విజయం వల్ల పెద్ద నాగారం గ్రామ పేరు జిల్లా వ్యాప్తంగా మార్మోగిందని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కొమ్ము ప్రగతిని ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు:గుజి వీరస్వామి (టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు), కొమ్ము మధుకర్ (ఫోటో స్టూడియో), గాడుదుల కొమురవెల్లి, గంట రాములు, కొమ్ము వీరభద్రం, కొమ్ము ఉపేందర్, కొమ్ము రఫీ, చలమల్ల పవన్ గౌడ్, చలమల్ల నరేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కొమ్ము ఎల్లయ్య, కర్నే శ్రీకాంత్, గంట మహేష్, బింగి విక్రమ్ గౌడ్, గుజి వెంకన్న, జంపాల ఉపేందర్, పులిచింత అమృత రెడ్డి, గంట కొమురెల్లి, సప్పిడి జయపాల్ రెడ్డి, కొమ్ము మహేందర్, గులగట్టు రమేష్, తుడుసు సతీష్, మందుల రమేష్ తదితరులు ఉన్నారు.గ్రామానికి కీర్తి తీసుకొచ్చిన కొమ్ము ప్రగతికి గ్రామ ప్రజలంతా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

