నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 22~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట నగర పంచాయతీలోని పీటిఎం రోడ్డు లో గల ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం గోల్ మాల్ బాగోతం బయటపడింది. స్థానికురాలైన జంగాల చంద్రకళ అనే బాధితురాలు 13 -2 – 2023 లో 14 గ్రాములు గల బంగారు వస్తువులను తాకట్టు పెట్టింది. రేటు ప్రకారం 33 వేల రూపాయలు వస్తుందని చెప్పి ఆమెకు ఆ డబ్బును అందించారు. కానీ అప్పుడున్న బంగారం ధర 60 వేల రూపాయలు. దీన్ని ఆసరాగా తీసుకున్న అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది శివ 55 వేల రూపాయలు తీసుకున్నారు. పలుదపాలుగా బాధితురాలు చంద్రకళ రసీదును అడుగుతున్న ఇవ్వకుండా యామార్చారు. సోమవారం ఆమె నగలను విడిపించుకోవడానికి ముత్తూట్ ఫైనాన్స్ కు వెళ్లి విచారిస్తే రెండు సంవత్సరాలకు 82 వేలు వడ్డీ అయిందని అది చెల్లిస్తే మీ నగదు ఇస్తామని ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు తెలిపారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం ఆమెకు వాస్తవాలు తెలిసొచ్చింది. వాళ్లను గట్టిగా నిలదీస్తే రూ. 50 వేలు మీరు చెల్లించండి. మిగిలింది మేము కడతామంటూ అక్కడే పని చేస్తున్న శివ బుక్కాయించే ప్రయత్నం చేశాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించింది. మీడియాకు ఆమె గోడును వెల్లబోస్తూ రెండు సంవత్సరాల క్రితం డబ్బు అవసరాల కోసం ఉన్న నగదును ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టామని అప్పుడు మాకు ఇచ్చిన నగదు 33 వేల రూపాయలను మాత్రమే ఇచ్చి అక్కడ పని చేస్తున్న మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది శివ రూ. 55 వేలు తీసుకున్నారు. బంగారు నగలు విడిపించుకోవడానికి వెళ్తే రెండు సంవత్సరాలకు రూ. 82 వేలు అయిందని పూర్తి డబ్బు కడితే ఇస్తామని మేనేజర్ చెప్పాడు. రాజశేఖర్, శివ ను గట్టిగా నిలదీస్తే రూ. 50 వేలు ఇస్తే మిగిలింది మేము జమచేసి బంగారు నగలు విడిపిస్తామని రూ. 50వేలు తీసుకున్నారు. ఇచ్చి పది రోజులవుతున్నా అతి, గతి లేదు. సోమవారం ముత్తూట్ ఫైనాన్స్ వద్దకు వెళ్లి విచారిస్తే రూ. 50 వేలు కూడా జమ చేయలేదు. దీంతో నేను మోసపోయానని మీడియాను ఆశ్రయించి మీ దృష్టికి తీసుకొచ్చాను. నాకు మీరే న్యాయం చేయాలంటూ కన్నీటితో వేడుకుంటూ లబోదిబోమంటుంది. వీళ్ళు మరి కొందరికి కూడా ఇలాగే చేశారని లోన్ తీసుకున్న వారికి రసీదులు ఇవ్వకుండా ఇలాగే చేస్తున్నారని మరి కొంత మంది బాధితులు మీడియా ముందుకొచ్చారు. ఈ ఘటనలపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.గతంలో కూడా 50 లక్షలు స్వాహా చేసిన సిబ్బంది..—————————-సంవత్సరం క్రితం స్థానిక రంగసముద్రం రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఖాతా దారుల బంగారాన్ని మళ్ళీ వేరే వాళ్ల పేరుతో పెట్టి 50 లక్షలు స్వాహా చేశారు. అది తెలిసి ఖాతాదారులకు సిబ్బందికి తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు పోలీసులు కలగజేసుకొని వివాదాన్ని సద్దుమణిగించారు. ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది లీలలో మోసపోయిన వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్ వారి ఆటలు శృతిమించుతున్నాయి. పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వీరి ఆగడాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనాన్స్ వ్యాపారాన్ని పూర్తిగా మూయించేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక పట్టణ ప్రజలు కోరుతున్నారు..~~~~~~~~~~~~~~~~





