నేటి సాక్షి, దేవరకద్ర జులై 6
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గం లోని ఆయా మండలాల
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను ఆదివారం వివిధ ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లోని శ్రీకృష్ణ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూత్పుర్ మండలం వెల్కిచర్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నాగన్న అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి నాగన్నను పరామర్శించారు. అలాగే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలనీ వైద్యులను మాజీ ఎమ్మెల్య ఆల కోరారు.
అలాగే శ్రీకృష్ణ న్యూరో ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి లక్ష్మయ్య బంధువులు ఆంజనేయులును రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బాధితుడ్ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలనీ వైద్యులను కోరారు.అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రవి చిన్నపిల్లల ఆసుపత్రిలో చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన అంజిచారి కూతురు ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పోందుతున్నారు.ఆ చిన్నారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.