నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 21:కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామానికి చెందిన దేవల కొండలరావు కొన్నేళ్ళ క్రితం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు .. బాధిత కుటుంబం గురించి స్థానిక మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు , సంబంధిత విద్యుత్ అధికారుల ద్వారా మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవల ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఐదు లక్షల రూపాయల చెక్కు మంజూరైంది.. మంగళవారం మంత్రి పొంగులేటి చేతుల మీదుగా మృతుడు కొండలరావు భార్య దేవల దుర్గకు మంజూరైన విద్యుత్ ఇన్సూరెన్స్ చెక్కును అందించారు.. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ నాగేశ్వరరావు , ఏడిఏ కోక్యా నాయక్ ,కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు , మండల నాయకులు చాట్ల పరుశురాం , గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కందునూరి ఏడుకొండలు , కందునూరి లక్ష్మీనారాయణ ఏర్ల నరేష్ , దేవల వెంకటస్వామి , వీరబాబు తదితరులు పాల్గొన్నారు.





