నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించి వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను బుధవారం పరామర్శించారు. కొత్తపేట గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకులు కుశనపల్లి రవింధర్ తండ్రి చంద్రయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఓదార్పు అందించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గౌరెల్లి లక్ష్మణ్ రావు, గాజుల బుచ్చమ్మ లు మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ప్రజల కష్ట, నష్టాలలో తోడుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామడుగు రాజేష్, కోడి గంగయ్య, బండి సురేష్, ఉప్పు రాజయ్య, గౌరి చిరంజీవి, కొదురుపాక సతీష్, తిరుపతి రెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

