Thursday, March 19, 2026

*బాపట్ల పట్టణంలో డ్రైనేజ్ సమస్యలకు చెక్ పెడుతావ్** బాపట్ల పట్టణ ప్రజలకు సమస్య లేకుండా చేస్తా * బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)బాపట్ల పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఈ రఘునాథరెడ్డి అన్నారు.బాపట్ల పురపాలక సంఘం,కమిషనర్ జి.రఘునాథ రెడ్డి జి.బి.సి. రోడ్‌ మరియూ వార్డుల నందు పర్యటన నిర్వహించారు. తన పరిశీలనలో భాగంగా పారిశుధ్య కార్మికుల తో ప్రత్యక్షంగా మాట్లాడి వార్డుల్లో ప్రతిరోజూ చేయాల్సిన పారిశుధ్య పనులపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. చెత్త సేకరణ, రోడ్ల శుభ్రపరచడం, డ్రెయినేజ్ నిర్వహణ వంటి పనులను సమయానికి నిరంతరం చేయాలని కమిషనర్ ఆదేశించారు.తరువాత కమిషనర్ కృష్ణ మందిరం ప్రాంతం (34వ వార్డ్) నందు పర్యటించారు.అక్కడ ప్రజలు ఏళ్లుగా డ్రెయినేజ్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం, మురుగునీరు పారుదల లేక పొవడం వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్న విషయం ఆయ‌న గమనించారు. వెంటనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను పిలిచి, ఆ ప్రాంతంలో డ్రెయినేజ్ వ్యవస్థ నిర్మాణానికి తక్షణమే సరైన అంచనా (Estimate) సిద్ధం చేసి, అత్యవసరంగా పనులను చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.పట్టణ ప్రజల సమస్యలపై త్వరితంగా స్పందిస్తూ, ఎక్కడైనా శానిటేషన్ లేదా డ్రెయినేజ్ లోపాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజారోగ్య రక్షణ కోసం పురపాలక సంస్థ అన్ని చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం 3 వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ ఏరియా నందు మురుగు నీరు చెరువు పూడ్చు పనులను నేరుగా పరిశీలించారు. చెరువు ప్రక్కన ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన చెరువును పూడ్చాలని ఆదేశించారు. ఈ పర్యటనలో వారి వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యస్. యస్.ఆర్. కృష్ణా రెడ్డి మరియు పురపాలక సంఘ సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News