
ఎల్లుల్ల
ఎల్లమ్మ తల్లిని నమ్ముకున్న..
ఈ ఎనభైఏళ్ల ఎల్లవ్వ చెబుతోన్న ‘బతుకుచిత్రం’
ఎందరిలోనో ‘ఆత్మవిశ్వాసం’ నింపుతోంది.!!
ఏం చేస్తున్నావంటే..
‘ఖాళీయే బ్రో’ అని సమాధానం చెప్పే వారికి
ఓ దారి చూపుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. నడువనీకి..
శాతగాని వయసులో
ఎగిలివారక ముందే ఊరవతలికి ఈడ్గిలవడకుంట వోయి మోత్కాకులను తెంపుకచ్చుకుని ‘ఇస్తార్లు’ కుట్టుకుంటది.
‘అట్టిశాపలు’ ఓ గుల్లల..
‘ఎండురొయ్యపొట్టు’ డబ్బల.’బుకగులాల పొట్లాలు’.’నల్లకనుములు’.’కుడుకలు’..ఓ ‘తట్టుబొంతల’ వోసుకుని ఎల్లమ్మ కాడికి వొయ్యే తొవ్వల మూలమీద మంగుళారం మంగుళారం కూసుంటది.
తనకు..
బుద్దితెలిసిన్నుండి..
గీ ఎల్లవ్వ ఎల్లమ్మతల్లి
పూజకు వనికచ్చే సామాను అమ్ముకుంటూ తాను బతుకుతూ తన కుటుంబాన్నీ పోషించుకుంటోంది.
తన
అయ్యావ్వను తిట్టదు..
అత్తమామలన్ను మాటనదు..
మొగునిమీదా దుబ్బవొయ్యదు..
కడుపునవుట్టిన పిల్లల్నూ
పల్లెత్తు మాటనదు..
ఒకింటికెళ్లచ్చిన కోడండ్లనూ..
అసంటనదు..
అలాగనీ ‘బిచ్చమెత్తుకోదు’.
తనకు..’బతుకుదారి’ చూపిన
‘ఎల్లుల్ల ఎల్లవ్వతల్లి’ మీద భారమేసి బతుకెళ్లదీస్తున్న ఈ అవ్వకున్న ఓపికను చూసి తమ ప్రవృత్తి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!
– రాధారపు నర్సయ్య, 94400 11066 (నేటి సాక్షి, కోరుట్ల)

