Tuesday, March 10, 2026

*బాలల భద్రత మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం*

నేటి సాక్షి,నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి, రంగాపురం, మూడుచేక్కల పల్లె, నారక్క పేట, గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో బాలల భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి పి .బిక్షపతి రావు పాల్గొని మాట్లాడుతూ…. డ్రగ్స్ కు విద్యార్థులు బానిసలు కావద్దని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఎలాంటి డ్రగ్స్ రహిత పదార్థాలను వాడొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోవర్ధన్, ఎమ్మార్వో ముప్పు కృష్ణ, డాక్టర్ ఆచార్య, నల్లబెల్లి సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, డాగల రాజేష్, పంచాయతీ కార్యదర్శి దర్మేందర్ వార్డు సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News