Thursday, March 19, 2026

*బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత :**- ప్రజా కళావేదిక ఛైర్మన్ అరవ జయపాల్*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి, బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిదీ అని ప్రజా కళావేదిక వ్యవస్థాపక ఛైర్మన్ అరవ జయపాల్ అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు బాలల హక్కులు, చట్టాల గురించి అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఎంసిహెచ్ యస్ మాడవీధిలో ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు హెడ్మాష్టర్ కె. ఆనందకుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెచ్ ఎం కె. సోమ శేఖర్ రెడ్డి, టీచర్లు కె. వరలక్ష్మి (తెలుగు పండిట్), సునీత (సోషల్ స్టడీస్), పిడి సుధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జయపాల్ మాట్లాడుతూ, బాలల హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించటం కోసం ప్రతి ఏటా నవంబరు 20వ తేదీన అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారన్నారు. బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యమన్నారు. బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత అని, సమాజంలో ప్రతి ఒక్కరు ఈ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలనీ అన్నారు. విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు అని, విద్య ప్రతి ఒక్కరికీ మౌలికస్థాయిలో ఉచితంగా లభించాలనీ పేర్కొన్నారు. నిర్భంధంగానైనా బాలలందరికీ విద్యా హక్కు అమలయినప్పుడే నవభారతంలో కాబోయే నూతన పౌరులు దేశాన్ని రక్షించుకోగలగుతారన్నారు. బాల కార్మికుల సమస్య కొంతవరకూ తగ్గినప్పటికీ పూర్తిగా మాసిపోలేదన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, బాలల సంక్షేమం కొరకు పార్లమెంటు కొన్ని చట్టాలు చేసిందన్నారు. జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, న్యాయసేవల చట్టం, ఉచిత నిర్భంధ ప్రాధమిక విద్య హక్కు, బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం, శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లై చట్టం వంటి ఎన్నో చట్టాలను చేసిందన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 15 ద్వారా పిల్లల సంక్షేమానికి ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించవచ్చనీ, సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ద్వారా, వివక్షకు వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 15 ద్వారా వ్యక్తిగత స్వేచ్చ, న్యాయ ప్రక్రియ యొక్క హక్కు ఆర్టికల్ 21 ద్వారా, అక్రమ రవాణా నుంచి రక్షించబడే హక్కు ఆర్టికల్ 23 ద్వారా బాలలకు హక్కులు ఏర్పరచబడ్డాయన్నారు. పిల్లలకు కూడా పెద్ద వారితో సమానంగా పన్నెండు బాలల హక్కులు ఇవ్వబడ్డాయన్నారు. పిల్లల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు, సంరక్షకులు బాధ్యత వహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా గాని, ఆచరణలో సాధ్యం కావటం లేదన్నారు. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరచారన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News