నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 4,నారాయణపేట: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో* గురువారం షీ టీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భద్రత, బాలికల రక్షణ, వేధింపుల నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు, మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియాలో వేదింపులు, అసభ్య ప్రవర్తనలు వంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా షి టీమ్ పోలీసులు చేనప్ప, జ్యోతి లు మాట్లాడుతూ… మహిళలు అపద సమయంలో 100/112, 181 మహిళా హెల్ప్‌లైన్ నెంబర్‌లను విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.పాఠశాల నుండి ఇంటికి వెళ్లే మార్గంలో ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు, వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు.సైబర్ వేధింపులపై బాధపడుతున్న బాలికలు తమ ఫిర్యాదులను పోలీసులకు తెలియజేయాలని, అన్ని రకాల ఫిర్యాదులను గోప్యంగా స్వీకరిస్తామని భరోసా కల్పించారు.సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.బాలికల భద్రత కోసం నారాయణపేట పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీలో ధైర్యం, అవగాహన పెంపు మా ప్రధాన లక్ష్యం. ఏ సమస్య అయినా వెంటనే సెల్ 8712670398 కి షి టీమ్ పోలీసులకు తెలియజేయండి అని చెప్పారు.కార్యక్రమంలో షి టీమ్ పోలీసులు బాలరాజు, కవిత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





