Tuesday, April 7, 2026

బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి జీవిత ఖైదు

బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.

నేటి సాక్షి – రాయికల్

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మైనర్ బాలికను నిందితుడు జైత భీమయ్య వయస్సు 66 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద తేదీ 25-07-2019 రోజున రాయికల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ కేసును దర్యాప్తు చేసిన డిఎస్పి వెంకటరామణ మరియు ఇన్స్పెక్టర్ రాజేష్ లు కోర్టు కి ఆధారాలు సమర్పించగా పిపి కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి మంగళవారం రోజున నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.17000 జరిమానా విధించారు.
మరియు బాధిత మైనర్ బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.

నేరం చేసిన వారు శిక్షను తప్పించుకోలేరు : ఎస్పీ

ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ … సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించు కోలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన స్పెషల్ పీ.పీ రామకృష్ణ రావు, డిఎస్పి వెంకటరమణ , రూరల్ ఇన్స్పెక్టర్ రాజేష్,ఎస్.ఐ ఆరోగ్యం, ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్ మరియు కానిస్టేబుల్స్ రాజు, కిరణ్, శ్రీధర్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News