నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 10(మెట్టు రుద్రరాజు).బాల్య వివాహాలను నిర్మూలించడానికి మండల ప్రజల సహకరించాలని తిరుమలాయపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ సిలార్ సాహెబ్ కోరారు యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన ప్రచార రథాన్ని మండలంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలను చేయడం వలన బాలల యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన వారం అవుతామని అన్నారు బాలివివాహాలను చేయడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆడపిల్లలకు ఇది శాపమని పేర్కొన్నారు బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే బాలికకు 20 సంవత్సరాలు నిండిన తర్వాతనే మగ వ్యక్తికి వివాహం చేయాలని అలాకాని ఎడల ఈ చట్టం ప్రకారము చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు ప్రజలు నాయకులు తల్లిదండ్రులు ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని విద్యావంతులైన యువతీ యువకులను భారతదేశానికి అందించాలంటే బాల్యవివాహాలను కూడా నిర్మూలించాలని ఆయన నొక్కి వక్కాణించారు. ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్య వివాహరహిత ఖమ్మం జిల్లా కై ప్రచారట దాన్ని గత వారం రోజులుగా జిల్లా అంతటా విస్తృత ప్రచారం చేస్తున్నామని జిల్లాలోని 21 మండలాలలో ఈ ఈ రథయాత్ర జరుగుతుందని తెలిపారు కావున ప్రజలందరూ సహకరించి బాల్య వివాహ రహిత ఖమ్మం జిల్లాను 2030 లోపే నిర్మించాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ సభ్యులు రవీందర్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

