Thursday, March 19, 2026

బాల్య వివాహాల నిర్మూలన సమిష్టి బాధ్యత

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 19,జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరూ సమిష్టిగా కృషి చేసి బాల్య వివాహా రహిత జిల్లాగా నారాయణపేటను మార్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ-జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యంగా బాలల రక్షణ పట్ల, వారి విద్య , సంరక్షణ,ఎదుగుదల, జిల్లా ఆకృతిని ప్రతిబింబించేలా రూపొందించిన లోగోను కలెక్టర్ తన ఛాంబర్ లో బుధవారం ఆవిష్కరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ సహకరించాలని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గాంగ్వర్, శ్రీను, ఆర్డిఓ రామ్ చందర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, డీ పీ ఆర్ వో రషీద్, భగీరథ ఈ ఈ రంగా రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, కోస్గి తహసిల్దార్ బక్క శ్రీనివాస్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని కరిష్మా పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News