Sunday, February 15, 2026

“బాల్య వివాహ రహిత భరత్”..పై విద్యార్థులకు అవగాహన-బాల్యవివాహల నిర్ములనకు చదువే ఆయుధం : సి.డబ్ల్యూ.సి చైర్మన్ చింత కృష్ణయ్య

నేటిసాక్షి, మిర్యాలగూడ (ఫిబ్రవరి 14) : సమాజంలో చిన్నారుల బాల్య వివాహాలు నిర్ములించాలని, వాటిని నిర్ములించాలంటే ప్రతి చిన్నారికి చదువే ఆయుధం అని సి.డబ్ల్యూ.సి చైర్మన్ చింత కృష్ణయ్య అన్నారు. అర్బన్ సీడీపీఓ రేఖల మమత ఆదేశాల మేరకు శనివారం అవంతిపురం జంగాల కాలనీ, మరియు తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ మిర్యాలగూడలో అంకూర్ మీడియా వారి సమక్షంలో “బాల్య వివాహ రహిత భరత్” 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.డబ్ల్యూ.సి చైర్మన్ చింత కృష్ణయ్య మాట్లాడుతూ,బాల్యం అనగా తల్లి గర్భంలో శిశువు దశనుండి 18 సంవత్సరాలు నిండే వరకు భాల్యం అంటారని, ఆ బాల్యంలో పిల్లలు అందరూ చదువుపైనే శ్రద్ధ చూపాలని, ఆడపిల్లలు అన్నిరంగాలలో ముందుండాలంటే, చదువును మధ్యలో ఆపివేయొద్దని, ఎక్కడైనా ఎవరికైనా బాల్యవివాహాలు జరిపిస్తున్నట్లు తెలిసి వెంటనే 1098 కు సమాచారం అందించాలని వివరించారు.ఈ యొక్క కార్యక్రమంలో మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ కుమారి, అంకుర్ మీడియా కో-ఆర్డినేటర్ గౌరీ శంకర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేస్ డిపార్ట్మెంట్ లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకన్న, అవంతి పురం సర్పంచ్ సుజాత సురేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ నాగమణి, రాధిక, మహిళా శక్తి సాధికారత శ్రీదేవి,యువశక్తి యన్. జీ. ఓ ప్రసిడెంట్ మల్లేష్ యాదవ్, రమణి, అంగన్వాడీ టీచర్స్ సువర్ణ, వసుమతి, అంజలి దేవి, సుజిత, మైనారిటీ స్కూల్ యాజమాన్యం, స్కూల్ విద్యార్థులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News