Wednesday, April 1, 2026

*బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకండి* మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి*

నేటిసాక్షి* ఏప్రిల్ 1 తిరుమలాయపాలెం(రుద్రరాజు)ప్రభుత్వం లేనంత మాత్రాన కార్యకర్తలు అధైర్య పడద్దని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పిండిప్రోలు, గోల్ తండా, రాజారం, గ్రామాలలో పలువురిని పరామర్శించారు. పిండిప్రోలు గ్రామంలోని ఉప సర్పంచ్ చామకూరి రాజు కూతురు చామకూరి విజయ ఫ్రూటీ కి ఇటీవల శాస్త్ర చికిత్స చేసుకోగా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గోల్ తండా లో మాజీ సర్పంచ్ బానోత్ పంతులు నాయక్ గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాజారం గ్రామంలో మెట్టు వెంకన్న భార్య రాధా ఒకే వారం వ్యవధిలో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆయన పరమశించారు. అనంతరం హస్నాబాద్ గ్రామపంచాయతీలో బిఆర్ఎస్ తరఫున గెలుపొందిన సర్పంచ్లను ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సందర్భంగా హుస్నాబాద్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను ఘర్షణలను ఆయనకు వివరించారు. బి ఆర్ ఎస్ కార్యకర్తలు ఎవరు తొందరపడద్దని అధికారం ఎవరికి సొంతం కాదని త్వరలో మనమే అధికారంలోకి వస్తామని ఆయన వివరించారు ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని ఎవరు తొందరపడి ఘర్షణలకు పాల్పడుద్దని బిఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ‌ మండల అధ్యక్షులు భాష బోయిన వీరన్న, మండల పార్టీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, నూతన సర్పంచులు కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి, బోడ మంజూ రవి, ఉపసర్పంచ్ లు చామకూరి రాజు, షేక్ చందు, పరికపల్లి చంద్రశేఖర్ అసలాది ముత్తయ్య చామకూరి శరత్ చామకూరి సునీల్ చిట్టి మాజీ సర్పంచ్ లు బోడ మంచ నాయక్, బండ్ల సురేష్ ఆలస్యం నాగేశ్వరావు, తమ్మెర రామ్మోహన్ రెడ్డి, బానోతు రంగా, మాజీ ఎంపిటిసి శంకర్, తీగల మేఘనాధరావు కొవ్వూరి సందీప్ రెడ్డి మోటపోతుల పెద్ద శ్రీను మోట పోతుల చిన్న శ్రీను మాగి వెంకన్న తండా అంజయ్య పల్లి వినోద్ పల్లి అశోక్ పల్లి నవీన్ వేల్పుల సైదులు ఉన్నం వెంకటేశ్వర్లు జక్కుల యాదగిరి పాసినేని శ్రీను కొత్తపల్లి మహేష్ జెప్పుల సీతారాములు బానోత్ వెంకన్న సైదా సయ్యద్ హుస్సేన్ సయ్యద్ రంగాపురం బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News