Thursday, March 12, 2026

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కందుకూరు మండలంలో గులాబీకి ఎదురుదెబ్బ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించిన లక్ష్మారెడ్డి ( కేఎల్ఆర్

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 13:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కాంగ్రెస్ కు కంచుకోటగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో ఫ్యూచర్ సిటీ ఐకానిక్ గా నిలవటంతో ప్రజలు హస్తంపార్టీ వైపు మొగ్గుతున్నారు.ఇవాళ దాసర్లపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు జంబుల శివరాంరెడ్డి సహా పలువురు నేతలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కందూరి యుగంధర్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీగా చేరారు.ఈ సందర్భంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఎల్ఆర్… పాత, కొత్త తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పిస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీతో మహేశ్వరం – మహానగరంగా అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి బహుమతిగా ఇద్దామని సూచించారు.భవిష్యత్ తరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కందుకూరు మండలం నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నేతలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News