నేటి సాక్షి,నారాయణపేట, జూలై 13,
మధనాపూర్ మండలంలోని గోపన్ పేట గ్రామంలో డా. బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి గారు, కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్,
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, డా. బి ఆర్ అంబేద్కర్ గారు చూపించిన దారిలో మనమందరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందులో భాగంగానే గ్రామస్తులు కోరిన కోరిక మేరకు మండలంలోని పలు గ్రామాలను ఆత్మకూర్ మండలంలోకి కలిపేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యనాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.