Thursday, March 19, 2026

బిజెపి ప్రభుత్వం ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణమ్మ

నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 12, కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మహబూబ్నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణమ్మ అన్నారు. శుక్రవారం నాడు నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఇంద్ర గాంధీ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలనలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆమె గుర్తు చేశారు. నిరుపేదల కోసం ఉచితంగా విద్యుత్ సౌకర్యం రుణ సౌకర్యం, ఉచితంగా వైద్య సేవలు రోడ్డు సౌకర్యాలు ప్రతి గ్రామానికి రోడ్లు ఎల్ఈడి లైట్లు ఎంపీ నిధుల ద్వారా ప్రతి గ్రామానికి నిధుల కేటాయింపు చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందని ఆమె గుర్తు చేశారు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సర్పంచ్ గా నిలబడిన అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. మరికల్ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థి సీమ శివకుమార్ కు నిలబెట్టడం జరిగిందన్నారు సీమ శివకుమార్ గుర్తు ఫుట్బాల్ గుర్తు కేటాయించడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. మరికల్ అభివృద్ధి చెందాలంటే ఫుట్బాల్ గుర్తుకే తమ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి పార్టీ నాయకులు మరికల్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News