నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ మండల ఎన్నికల ఇన్చార్జిలు కరివేద మైపాల్ రెడ్డి భార్గవ భార్గవి రెడ్డి లు కోరారు గన్నేరువరం మైలారం చొక్కారావు పల్లి గ్రామాలలో మంగళవారం సంధ్య వేణి ప్రశాంత్ గాలి పెళ్లి శంకర్ అరకొంతం అనిల్ కు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వివరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనా బ్రిడ్జి మంజూరు కోసం కృషి చేశాడు అన్నారు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి మీకు అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కరివేద మైపాల్ రెడ్డి భార్గవ రెడ్డి గాలి పెళ్లి శంకర్ అరకొంతం అనిల్ రెడ్డి తిప్పర్తి నికేష్ సంధ్య వేణి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు





