నేటి సాక్షి, రాయికల్ : రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఆకుల మహేష్ బిజెపి మండలశాఖ అధ్యక్షుడిగా సోమవారం నియమితులైయ్యారు. ఈ మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు నియామక పత్రాన్ని అందజేసారు. మహేష్ బిజెపిలో చాలకాలంగా పని చేస్తున్నారు. రాయికల్ మండలం రామాజీపేట మాజీ ఎంపిటిసిగా పని చేసారు. బిజెపి ప్రధానకార్యదర్శిగా ఉండగా ఈ మేరకు పదోన్నతి కల్పిస్తూ నియామకం చేసారు. తన నియామకానికి సహకరించిన నిజామాబాద్ ఎంపి ధర్మపురి ఆర్వింద్, జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు, మాజీ జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణిలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలస్థాయిలో అందరి సహాకారంతో పార్టీని మరింత పటిష్టత పరుస్తానని తెలిపారు.ఫోటో రైటప్: 23RKL01: పార్టీ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకుంటున్న దృశ్యం

