Tuesday, March 17, 2026

*బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి**బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషీధరాజు అభినందన సభలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పుష్పరెడ్డి* *నిషీధరాజు అభినందన సభలో పుష్ప రెడ్డికి అభినందనల వెల్లువ*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)తిరుపతి రూరల్,నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నియమితులైన సందర్భంగా తిరుచానూరులో బుదవారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పలువురు బిజెపి నేతలు హాజరై నిషీధరాజుకు పెద్ద ఎత్తున సన్మానం చేసి అంభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో తిరుచానూరుకు చెందిన విజయ గణపతి ఆలయ ధర్మకర్త,బిజెపి నాయకురాలు పుష్పరెడ్డి,తిరుపతి రూరల్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమితులైన సందర్భంగా వారు హాజరైన పార్టీ ప్రముఖులను,నాయకులను కలిసి తనకి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం నిషీధరాజుకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.నిషీధరాజు, పుష్పరెడ్డి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాఆనంద్ ,శ్రీకాళహస్తిరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు కోలా విశాలాక్షి , బిజెపి సీనియర్ మహిళా నాయకురాలు గాలి పుష్ప లత,తిరుచానూరు బిజెపి నాయకులు విజయ్ కుమార్,ఇంద్రా రెడ్డి,రూపేష్ కుమార్ ,నాగరాజు రెడ్డి,రమణ తదితరులను తన భర్త టాక్ ఆఫ్ ది టౌన్ పత్రిక అధినేత మునిరామ్ రెడ్డి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు పుష్ప మునిరామ్ రెడ్డి దంపతులను అభినందిస్తూ, పార్టీ కోసం,హిందూ ధర్మం కోసం,సమాజం పట్ల మీరు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News