*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోరుట్ల పట్టణంలోని బిలాల్పూర్ అంగన్వాడి పాఠశాలలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఆ సెంటర్ నిర్వాహకురాలు సాయీశ్వరీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా 22వ వార్డు మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్ హాజరై అనంతరం జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.*పిల్లలకు విద్యా సామగ్రి బహూకరించిన మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్*అనంతరం అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులకు పలకలు, బలపాలు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. చిన్నారులు చిన్న వయసులోనే చదువుపై ఆసక్తి పెంచుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరీ పాల్గొని మాట్లాడుతూ, అంగన్వాడి పిల్లల కోసం విద్యా సామగ్రిని అందించిన మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్‌కు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.ఈ వేడుకలో స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.___





