Saturday, March 21, 2026

*బిసిల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు సాయి ఈశ్వర్ చారి** ‘ఇకనైనా బిసిలు ఏకం కావాలి’ టీఆర్‌పీ, ప్రజా సంఘాల పిలుపు* 42% రిజర్వేషన్ల కోసం పోరాడిన అతని త్యాగం వ్యర్థం కాకూడదన్న సంకల్పం* అమరుడి అంతిమయాత్ర వైపు జనం రద్దీ—–*

నేటి సాక్షి – జగద్గిరిగుట్ట*బిసిల 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర్ చారి అంతిమ యాత్ర హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట వద్ద ఆయన నివాసం నుంచి ప్రారంభమైన సందర్భంగా విరాళ్లు, ఆవేదనల నడుమ వేలాది మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. ‘అమరహే సాయి ఈశ్వర్ చారి’ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. బిసిల హక్కుల కోసం ఇంతటి త్యాగం చేసిన నాయకుడి మరణం మొత్తం బిసి సమాజాన్ని విషాదంలో ముంచింది.*ఇప్పటికైనా బిసిలు ఏకం కావాలి*– ప్రజా సంఘాల నాయకుల పిలుపుటిఆర్పీ, బిసి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు అంతిమయాత్రలో పాల్గొని బిసి సమాజం ఇకనైనా చైతన్యంగా, ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈశ్వర్ చారి పోరాట స్పూర్తి బిసిలను ఏకం చేసే శక్తిగా మారాలని ఆకాంక్షించారు.ఈశ్వర్ చారి కుటుంబ సభ్యుల రోదనలు అంతిమయాత్రలో హృదయాలను పగిల్చాయి. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని నేతలు కోరారు. అంతిమయాత్రలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ఆకుల హన్మాండ్లు, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్, తెలంగాణ శ్యాం, టిఆర్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బాస రమేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల సందీప్ పటేల్, మెట్‌పల్లి మండల–పట్టణ అధ్యక్షులు గొర్రె భీమన్న, హైమద్ పాషా, దికొండ మురళి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ తెలిపారు.అమరుడు ఈశ్వర్ చారి చూపించిన మార్గం బిసి సమాజ హక్కుల కోసం మరింత పటిష్టమైన ఉద్యమానికి దారితీయాలని అందరూ ఏకగ్రీవంగా అభిలషించారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News