నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక తహసిల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి భారత్ సురక్ష సమితి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు,ప్రధాన కార్యదర్శి న్యాయవాది అక్కినపల్లి కాశీనాథం,సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక సామాజిక రాజకీయవేత్త అని ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మహిళల హక్కుల కొరకు కృషి చేశాడని ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కొరకు పోరాటం చేసిన మహనీయుడని,ఆయన ఇచ్చిన నినాదాలు చదువు సమీకరించు పోరాడు నినాదాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కులరహిత సమాజం కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సింగం గంగాధర్,బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలు అరవ లక్ష్మి కే డి సి సి బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ కుర్షిత్ అలీ బండారి మల్లికార్జున్ నరేందుల శ్రీనివాస్ న్యాయవాది హనుమల్ల భుజంగం తునికి అంజన్న కొత్తకొండ బాలన్న గాదాసు భూమన్న ఎడమల వెంకట్ రెడ్డి బాసెట్టి ప్రభాకర్ సిరిపురం గంగారం రాయికల్ రామచంద్రం వడ్డేపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.





