Saturday, March 21, 2026

బి. కొత్తకోటలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు మెరుపు దాడి.. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత మందులు, ఎరువులు విక్రయాలు అమ్మద్దు..ఎక్కువ ధరలకు అమ్మితే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవు.. రమణారావు

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 06 ~అన్నమయ్య జిల్లా :-: సామాజిక తనిఖీలల్లో భాగంగా శనివారం బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధి లోని పలు ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు పీలేరు ఏడీఏ రమణారావు, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ విచ్చేసి తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత మందులు, ఎరువులు విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ అధికారి రమణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ రమణారావు మాట్లాడుతూ దుకాణదారులు ప్రతి ఒక్కరూ ఎరువులు, క్రిమిసంహారక మందులు అధిక ధరలకు అమ్మిన, నిషేధిత బయో మందులు, ఎరువులు విక్రయాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న వారిపై ఫిర్యాదులు వస్తే అటువంటి వారి దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా దుకాణదారులు కొనుగోలు, అమ్మకాలు, ప్రస్తుత నిల్వ, రిజిస్టర్లలో కచ్చితంగా పొందుపరచాలని ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే క్రమంగా బిల్లులు కూడా ఇవ్వాలని, తూకాలలో తేడాలు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా అవగాహన పొంది రైతులు పంట మార్పిడి, ఆరుతడి పంటలు, ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏడీఏ వెంట బి. కొత్తకోట మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు..—————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News