Saturday, March 21, 2026

బి. కొత్తకోటలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ సిఐ గోపాల్ రెడ్డి..పార్టీలకతీతంగా తరలివచ్చి ఘన నివాళులు అర్పణ..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 06 ~అన్నమయ్య జిల్లా :-: రాజ్యాంగ వ్యూహకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని శనివారం స్థానిక నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట నగర పంచాయతీ పట్టణ పరిధిలోని స్థానిక జ్యోతి బస్టాండ్ నందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు యూనియన్ సభ్యులు పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా పట్టణ సి ఐ గోపాల్ రెడ్డి విచ్చేశారు. మాల మహానాడు యూనియన్ నాయకులు, సభ్యులు, పార్టీలకతీతంగా తరలివచ్చిన సభ్యుల సమూహంలో సీఐ గోపాల్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 6 వ తారీఖున భారత రాజ్యాంగాన్ని రచించడంలో ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన అంకితభావం, కృషిని ఈనాటికి గుర్తు చేసుకుంటున్నామని వాడ వాడల ఆయన విగ్రహాలకు, ఫోటోలకు పూల హారాలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్నామని ముఖ్యంగా రాజ్యాంగ రూపకర్తగా ఆయన సేవలు, ప్రాథమిక హక్కుల స్థాపనలో పాత్రను స్మరించుకుంటామని సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర, సమానత్వం, స్వేచ్ఛ, వివక్షతను తొలగించడంలో ఆయన చేసిన ఎనలేని కృషి, ఆయన సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, సమానత్వంపై అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను రూపకల్పన చేసిన గొప్ప మహనీయులని ఆయనను గుర్తు చేసుకుంటూ మనం జరుపుకునే వేడుకలు డాక్టర్ అంబేద్కర్ వారసత్వాన్ని, ఆయన ఆశయాలను భావి తరాలకు తెలియజేయడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు వైసీపీ యువ నాయకులు హరికృష్ణ సబ్జీ, నక్క మహేష్, దార్ల నరసింహులు, రామాంజి, సురేంద్ర, రాంబాబు, శంకర, వెంకటేష్, నారాయణ, సచిన్, సింగన్న, వెంకటేష్, బాస్ నాయకులు, సీపీఐ నాయకులు, మైనార్టీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు..—————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News