నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగిరేసిన సందర్భంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేశారు.ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, కునారపు భూమేష్, కడార్ల శ్రీనివాస్,మచ్చ నారాయణ,వాసం రామ,బన్న సంజీవ్,సమల్ల సతీష్,అల్లె నర్సయ్య, మరియు పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

