నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్లోని బీరప్ప గడ్డ, బీరప్ప ఆలయం ఎదురుగా ఉన్న జాతీయ ఉత్పత్తి పౌరసరఫరాల పంపిణీ కేంద్రం షాప్ నంబర్ 3302007 షాప్ ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వచ్చే సన్నబియ్యం సక్రమంగా సరఫరా చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. రేషన్ షాప్ లో ఉన్న సన్న బియ్యాన్ని పరిశీలించారు,
రేషన్ షాప్ ఓనర్ కి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణీత సమయంలో సన్న బియ్యం పంపిణీ జరగాలని ఆదేశించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బంటి గౌడ్, గొరిగి మల్లేష్ , కొండ్రు హనుమంతు,నిరంజన్, రామ్ రెడ్డి , ఐలేష్ యాదవ్, బర్ల కృష్ణ, మొదలగువారు పాల్గొన్నారు.

