Friday, March 13, 2026

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం**- బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )బీసీ సంఘాలు,బీసీ జేఏసీ ,బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెపి జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్ ఆద్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో బీసీ బంద్ చేయగా,స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు,విద్య సంస్థలు,కళాశాల లు బంద్ పాటించి మద్దతు తెలిపారని అన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అమలు సాధ్యం కాని 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల పేరుతో బీసీ లను మోసం చేసిందని, జీవో 9 తో చట్ట బద్దత కాదు అని తెలిసిన బీసీ లను మోసం చేయటానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని, బీసీ ల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే దానికి చట్ట బద్దత కల్పించి 42% రిజర్వేషన్లు కల్పించాలి అని,కోర్ట్ లో ఆగిపోయిన రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ మీద బద్నాం చేస్తే ఊరుకునేది లేదు అని,కేంద్రంలో పార్లమెంట్ లో ఆమోదం పొందాలి అంటే బీజేపీ మద్దతు ఇవ్వాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పలేదని అలాగే కామారెడ్డి డిక్లరేషన్ లో జ్యోతి రావు పూలే పేరుమీద బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఏడాదికి 20వేల కోట్లు,5 సంవత్సరాలకు 1 లక్ష కోట్లు కేటాయిస్తాం అని చెప్పి మోసం చేసిందని,గత అసెంబ్లీ బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన బీసీ లకు కేటాయించే నిధులు కేవలం పీజు బకాయిలకే సరిపోతాయని,అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్ నీ నిర్మిస్తాం అని చెప్పి మోసం చేసిందని,బీసీ ల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంబిస్తుందని, ఇచ్చిన హామీ లను అమలు చేయలేక అధికారంలో ఉండి చేతకాక బంద్ లో పాల్గొని బీసీ లను మోసం చేసే అతి పెద్ద కుట్ర దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ బాగోతాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో బీసీ అందరూ బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని,పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పడాల గణేష్, బోయినీ రాజు, పెద్ది శ్రవణ్,గడ్డం రవీందర్,మీసాల రవీందర్,గడ్డం గణేష్,గసికంటి వెంకటి, మ్యకల శ్రీకర్, కముటం గణేష్, గోపరవేణి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News