నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 10 చౌడేపల్లి పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా, ఉన్నటువంటి బీసీ కాలనీలో దేవస్థానం నిర్మాణానికి స్థలం ,కేటాయించాలని కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు ,సంవత్సరాల తరబడి కాలనీలో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నామని అయితే కాలనీలో ఎలాంటి దేవస్థానం లేదన్నారు ,దీంతో బీసీ కాలనీలోనే ఉన్న ఆరు సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం నిర్మాణానికి ,కేటాయించాలని వారు కోరుతున్నారు. ఆ స్థలంపై ఎవరికి హక్కు లేదని ప్రభుత్వమే తమకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా కాలనీ మహిళలు కోరారు, ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ మహిళలు పాల్గొన్నారు

