నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 05 ~అన్నమయ్య జిల్లా :-: బీసీ నాయకుడు విజయభాస్కర్ పై దాడి చేయడం బాధాకరమని ఇలాంటి దాడులు సమాజానికి ఉపయోగపడదని అధికారంలో ఎవరు ఉంటే వాళ్లు మరొకరిపై దాడులు జరుపుకుంటే నష్టపోయేది మన కుటుంబాలేనని ఇలా దాడులు చేయడం వల్ల కుటుంబాన్ని బాధ పెట్టడమవుతుందని కడప జిల్లా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ ఆవుల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. రెండు రోజులకు ముందు రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీసీ విబాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పై దాడిని ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చిదంబర రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేహక్కు ప్రజలందరకీ ఉంటుందని ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం దారుణమని ఇలా ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడటం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబ్యాల విజయభాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నమయ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిదంబరం రెడ్డి అన్నారు. శుక్రవారం సిబ్యాల విజయభాస్కర్ ను మరియు ఆయన కుటుంబాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల మల్లికార్జున రెడ్డి, వడ్డీ వెంకటరమణ రెడ్డి, కేతంరెడ్డి వాసుదేవారెడ్డి తదితరులు కలిసి సిబ్యాల విజయభాస్కర్ ఆరోగ్యం పై ఆరా తీసి మరి కొద్ది రోజులు విరామం తీసుకోవాలని సూచిస్తూ ధైర్యంగా ఉండాలని పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని మేమంతా భరోసాగా ఉంటామని తెలియజేశారు..~~~~~~~~~~~~~~~~~~





