నేటి సాక్షి(పూరెళ్ల బాపు) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు పిలుపుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ తెలిపారు. పెగడపల్లి మండల కేంద్రంలో సంపూర్ణ మద్దతు తెలుపుతూ డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రధాన కూడలిలో కార్యకర్తలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమేశ్వర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42’/. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర బీజేపీ అధికార ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలను నిరాశ పరిచిందని ఆవేదన వ్యక్త పరిచారు.బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయితే విద్యార్థులకు, రాజకీయ నిరుద్యోగులకు, నిరుద్యోగ యువతి యువకులకు పేద బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని అన్నారు. బీసీ బందుకు దళిత కుల పోరాట సమితి ప్రత్యక్షంగా పాల్గొంటుందని బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శనిగారపు ప్రవీణ్, డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాచర్ల సురేష్, గర్వందుల రాజశేఖర్, జుట్టు శేఖర్, సిగిరి రాజకుమార్, సిపెల్లి బాబు, పాదం కొమురయ్య, బైర రాజయ్య,తోడేటి సంజీవ్, మహమ్మద్ నబి, బొమ్మన సతీష్, జూపాక అరవింద్, ఆవుల తిరుపతి. బొమ్మెన రవి, ఎండి మౌలానా. బొమ్మన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.




