Wednesday, March 18, 2026

బీసీ రిజర్వేషన్ల మహా ధర్నాను విజయవంతం చేయండి బీఎస్పీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల బీసీ రిజర్వేషన్లు సాధించడంలో బీఎస్పీ కీలకపాత్ర!బీసీల ఓట్ల కోసమే బీజేపీ,కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలు!నాడు బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఉద్యమం చేసిన బీజేపీబీసీలకు అధికారం బీఎస్పీ తోనే సాధ్యం!బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్….

నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 27,42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నవంబర్ ఒకటో తేదీన బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ కోరారు.సోమవారం మక్తల్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీసీ రిజర్వేషన్ ధర్నా వాల్ పోస్టర్ విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు బీసీ రిజర్వేషన్ కొరకు బీఎస్పీ పోరాటం చేయడంతోనే 27శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.నాడు బీసీ రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ దేశ వ్యాప్త ఉద్యమం చేసి నేడు బీసీల ఓట్ల కోసం డ్రామాలాడుతుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఏమాత్రం చిత్తలేదని,కేవలం బీసీ కులాలను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారం చెలాయిస్తుందన్నారు.బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీ ద్వారానే సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసి మెంబర్ జుట్ల నరేందర్,జిల్లా ఇంచార్జ్ గువ్వల తిరుపతి,జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్,మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కేవీ నరసింహ ఇంచార్జ్ పాలెం వెంకటయ్య,,ప్రధాన కార్యాదర్శి మల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్,బీఎస్పీ నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News