నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 18) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ మరియు మాజీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ శ్రేణులు బారి సంఖ్యలో బందు కార్యక్రమంలో పాల్గొని సమస్త బీసీ సమాజానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచురి శ్రీధర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపు నిర్ణయానికి బి ఆర్ ఎస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. బీసీ ల అభ్యున్నతికి కట్టుబడి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో పదేండ్లు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశ దిశ లేని తొందర పాటు నిర్ణయాలు తీసుకొని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు బీసీ లను నయవంచనకు గురిచేస్తున్నాయి అని మండి పడ్డారు. కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి నేడు అదే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు హైకోర్టులో కోర్టులో కేసులు వేసి బీసీ ల గొంతు కోసారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్, బిజెపి పార్టీలు బీసీ ల పై కపట ప్రేమను మాని చిత్తశుద్ధితో రిజర్వేషన్ల అమలకు కృషి చేయాలని లేని పక్షంలో బీసీ సంఘలతో కలసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లను హెచ్చరించారు. అనంతరం బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించిన వాణిజ్య, వ్యాపార సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళ నేతలు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




