నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 19 :కూసుమంచి మండలంలోని నేలపట్ల ,పెరికసింగారం గ్రామాలలో రైతులకు యూరియా బుకింగ్ యాప్ గురించి మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. సోమవారం నుండి అన్ని ఎరువుల దుకాణాలలో యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే యూరియా అమ్మకాలు జరుగుతాయని, రైతులు ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.. మండలంలో యూరియా అందుబాటులో ఉన్న దుకాణాల ద్వారా బుక్ చేసుకుని యూరియా కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రైతులు వేసిన పంటల ఆధారంగా ఎకరాకు సరిపడ మోతాదులో యూరియా అందించబడుతుందని తెలిపారు. ఎకరంలోపు రైతులకు ఒకేసారి ఇవ్వబడుతుందని, ఐదు ఎకరాల లోపు రైతులకు రెండు దఫాలలో యూరియా అందించబడుతుందని, 5 నుండి 20 ఎకరాలలో రైతులకు మూడు దఫాలలో, 20 ఎకరాల పైబడిన రైతులకు నాలుగు దఫాలలో యూరియా అందించబడుతుందని తెలిపారు.. ప్రతి దఫాకు 15 రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేశారు. ఏదైనా కారణం వల్ల రైతులు ఏరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోపు యూరియా తీసుకొనట్లయితే వారి బుకింగ్ క్యాన్సిల్ అవుతుందని, మరల వారు 24 గంటల తర్వాత తిరిగి బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ వినియోగ విషయంలో రైతులు ఎటువంటి సమస్యలు లేకుండా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు అందుబాటులో ఉండి రైతులకు యూరియా బుకింగ్ లో సహాయపడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ, సాయిరాం ,వంశీ ,నవీన్ , రవికుమార్ ,రవీందర్ ,సౌమ్య , ప్రియాంక, రైతులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమాన్ని మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు నాయకన్ గూడెం,కిష్టాపురం,పాలేరు, చేగోమ్మ, జీళ్ళచెరువు, పోచారం గ్రామాలలో నిర్వహించారు.





