Sunday, February 22, 2026

బుద్ధుని తో నా ప్రయాణం నాటకాన్ని విజయవంతం చేద్దాం : డా.మువ్వా రామారావు,డా.జాడి రాజు

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని కళాభారతిలో మార్చి 3న సాయంత్రం నిర్వహించనున్న బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని పరిసర ప్రజలంతా విజయవంతం చేయాలని నిర్వాహకులు డాక్టర్ మువ్వా రామారావు, సామాజిక వెత్త జాడి రాజు అన్నారు. శనివారం పట్టణంలోని కళాభారతి వద్ద పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బుద్ధుని యొక్క శాంతి మార్గాన్ని స్వీకరించిన అంబేద్కర్ గురించి అద్భుతంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ప్రభాకర్ కందుకూరి సుదర్శన్, వెంకటేష్ లక్ష్మణ్ వినయ్ కుమార్, రామయ్య తాళ్లపల్లి రాములు సుదర్శన్ రెడ్డి, జయరాజు, బి నరేష్ పున్న రాములు మారం శ్రీనివాస్, పరిమితి రామావతారం, శ్రీరాములు గౌడ్, గుడిపాటి వెంకటేశ్వర్లు, దారం మల్లేష్ యాదవ్, బిక్షమయ్య, కోడిరెక్క సురేష్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News