Wednesday, March 25, 2026

*బుపెల్లి బానయ్య సేవలు అపూర్వం*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)దమ్మాయి గూడ నాగారం మున్సిపాలిటీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుపెల్లి బానయ్య సంతాప సభ లో పలువురు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించించారు. ఈ సంతాప సభను ఉద్దేశించి సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ… దివంగత బానయ్య సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటీజన్ లకు ఎన్నో సేవలు చేశారని, భౌతికంగా ఆయన లేకున్నను ఆయన సేవలు సమాజం గుర్తించుకుంటుదని,సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, మెడికల్ సర్వీసుల కొరకు ఉద్యమించి, మార్గదర్శులుగా ఉన్నారు.బానయ్య మరణం సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు తీరని లోటని తెలిపారు. ఈ సంతాప సభలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండంరాజు రాంచందర్ రావు, ఉప ప్రధాన కార్యదర్శి ఆళ వందార్ వేణు మాధవ్,జి.వి.రాజి రెడ్డి, టి.ఉమాకర్, ఎం.విజయ్ బాబు,ఎస్.నర్సింగ్ రావు, జయంత్ కుమార్ ,రాజనర్సు, ఎస్.లక్ష్మి నారాయణ,చుక్కల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News