నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామంలో భూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్ రెవెన్యూ గ్రామాలకు వచ్చి పరిశీలించడం జరిగింది తహశీల్దార్ నేతృత్వంలోని బృందం ‘ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో’ కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన,భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. రెవెన్యూ సేవలను సరళతరం చేయడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి -2025 చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఈ చట్టంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజక్టు కింద జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి అవగాహన సదస్సులు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం లో రెవెన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

