నేటి సాక్షి, బెజ్జంకి:తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ జన్మదిన వేడుకలు గుండారంలోని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బెజ్జంకిలో మంగళవారం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పుట్టినరోజులు పురస్కరించుకొని కేకు ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండారం మాజీ ఎంపీటీసీ ఎలుక దేవయ్య పూర్వ విద్యార్థులు సాన వేణు, గొడ్డటి బాబు, పర్ష నాగరాజు, పోతుల హరీష్, సామీడి పవన్, గునుకుల కొండాపూర్ పాలకేంద్రం చైర్మన్ జాగిరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

