Wednesday, March 18, 2026

బెజ్జంకి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు • ముగ్గురిపై సంవత్సరం బైండోవర్

నేటి సాక్షి, బెజ్జంకి:మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు మరింత కఠినతరం చేశారు. తాజాగా తోటపల్లి గ్రామానికి చెందిన మడ్డి సందీప్, నాంపల్లి మహేష్, కొన్నే అనిల్‌లు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన బెజ్జంకి పోలీసులు, వారిని తహశీల్దార్ ఎదుట సంవత్సరం పాటు అక్రమ ఇసుక రవాణా చేయకుండా నిలువరించడానికి బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా ఏఎస్‌ఐ శంకర్ రావు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కూడా నష్టం జరుగుతుందని, ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News