నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహేశ్ అనే గీతాకార్మికుడు బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బులు పెట్టి నష్టపోయినట్లు సమాచారం. సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టిన మహేశ్‌కు డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.*ఆర్థిక నష్టంతో మనస్తాపం.!*బెట్టింగ్ యాప్‌లలో లాభాల ఆశతో డబ్బులు పెట్టిన మహేశ్ వరుసగా నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. మహేశ్‌కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు తెలిసింది.*లక్ష్మీపూర్ గ్రామస్థుల తీవ్ర ఆందోళన.!*జగిత్యాల జిల్లాలో బెట్టింగ్ యాప్‌ల వల్ల బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువత, కార్మికులు సులభ డబ్బుల ఆశతో ఇలాంటి యాప్‌లకు బలవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే బెట్టింగ్ యాప్‌లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.*కుటుంబాన్ని పరామర్శించిన జీవన్ రెడ్డి*విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి గ్రామానికి వెళ్లి మహేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం బాధిత కుటుంబానికి సహాయం చేయాలని కోరుతామని తెలిపారు.బెట్టింగ్ యాప్‌ల మాయాజాలానికి లోనుకాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆర్థికంగా నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.__________




