Saturday, March 7, 2026

‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’ అవార్డు అందుకున్న నటుడు ఆనంద చక్రపాణి

నేటిసాక్షి, మిర్యాలగూడ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వింధ్యా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ 7వ సంవత్సరపు ఉత్సవ పోటీలో తెలుగు సినిమా నటుడు ఆనంద చక్రపాణి జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’ అవార్డును సాధించారు ఆనంద చక్రపాణి ఒకప్పుడు మిర్యాలగూడ వాసి. చలనచిత్ర నటుడిగా ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఈ పోటీలో సుమారు 40 దేశాల చిత్రాలు పాల్గొన్నాయి. షార్ట్ ఫిల్మ్ కేటగిరీ లో ‘సారీ’ అనే చిత్రంలో చక్రపాణి కనబరిచిన నటనకు గాను జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ,ఈ అవార్డు తనకు ఎంతో స్ఫూర్తి కలిగించిందని, ఇది తనకు దక్కిన ప్రోత్సాహం అని అన్నారు.నటుడిగా మరిన్ని మంచి పాత్రలను పోషించి, అందరి మన్ననలు పొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు కేతనపల్లి శ్రీనివాసరెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, కస్తూరి ప్రభాకర్, విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య, హరికృష్ణ తదితరులు అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News